బెంగళూరు, ఏప్రిల్ 8: బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పై ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రముఖ లింగాయత్ స్వా మీజీ, శిరహటి ఫక్కీరేశ్వర మఠానికి చెందిన ఫకీర దింగాళేశ్వర స్వామి సోమవారం ప్రకటించా రు. లింగాయత్ మఠాలను మంత్రి దుర్వినియోగం చేశారని, వారిని అగౌరవపరిచారని స్వామీజీ ఆరోపించారు. అందుకే తాను స్వ యంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. ప్రహ్లాద్ జోషిపై ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు.
వీరశైవ, లింగాయత్ వర్గాలను ప్రహ్లాద్ జోషీ అణచివేశార ని ఆరోపించారు. కాంగ్రెస్, బీజే పీ రెండు జాతీయ పార్టీలు ధా ర్వాడ్ నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేశాయన్నారు. ధర్మం లో రాజకీయాలుండకూడదని, కానీ రాజకీయాల్లో ధర్మం ఉండాలన్నారు. ధార్వాడ్ నియోజకవర్గంలో లింగాయత్‌ల ఓట్లు అధికం కాగా.. బ్రాహ్మణులకు చెందిన ప్రహ్లాద్ జోషి అక్కడి నుండి నాలుగుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మే 7న జరిగే రెండో దశలో ధార్వాడ్ పోలింగ్ జరుగనున్నది.