ఐఐటీల్లో తీవ్ర ఫ్యాకల్టీ కొరత.. 33 శాతం పోస్టులు ఖాళీ
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీలు తీవ్ర అధ్యాపక కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశ వ్యాప్తంగా 22 ఐఐటీల్లో మొత్తం మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 38 శాతం భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీలు తీవ్ర అధ్యాపక కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశ వ్యాప్తంగా 22 ఐఐటీల్లో మొత్తం మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 38 శాతం భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. ప్రతి 10 బోధనా పోస్టుల స్థానాల్లో నాలుగు ఖాళీగా ఉన్నాయి. 22 ఐఐటీలకు 12,198 బోధన పోస్టులు మంజూరు కాగా, అందులో 7,558 మాత్రమే భర్తీ అయ్యాయి. 4,640 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇది 38.04 శాతమని ఒక నివేదిక తెలిపింది. ఐఐటీ ఖరగ్పూర్లో అత్యధికంగా 51.31 శాతం బోధనా సిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 48.4 శాతం పోస్ట్ల ఖాళీతో ఐఐటీ (ఐఎస్ఎం) ధన్బాద్ రెండో స్థానంలో ఉంది.
ఈ బోధనా సిబ్బంది లోటును ఈ సంస్థలు అడ్ హాక్, గెస్ట్, కాంట్రాక్టు, తాత్కాలిక, రీ ఎంప్లాయి టీచర్లతో కొంతవరకు భర్తీ చేసుకుంటున్నాయి. ఐఐటీ బాంబే అత్యధికంగా 234 మంది తాత్కాలిక బోధనా సిబ్బందిని నియమించుకుంది. ఐఐటీ మద్రాస్ 139, ఐఐటీ గాంధీనగర్ 81, ఐఐటీ కాన్పూర్ 55 మంది తాత్కాలిక సిబ్బందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు అయితే తాత్కాలిక సిబ్బంది నియామకాల జోలికే వెళ్లలేదు. మరి కొన్నయితే అతి తక్కువ మందిని మాత్రమే నియమించుకున్నాయి. దీనిని బట్టి తాత్కాలిక సిబ్బంది నియామకంలో కూడా ఈ సంస్థలు ఏకరీతిన వ్యవహరించడం లేదన్న విషయం స్పష్టమవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

