గతేడాది పుష్కలంగా నాగార్జున సాగర్ డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరినా ఆ నీటిని ప్రణాళికా బద్ధంగా వినియోగించుకోకపోవడంతో నీటి నిల్వలు ఆడుగంటి, తాగు, సాగు నీటి కోసం రానున్న వర్షాకాలంలో సైతం నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నందికొండ, జూలై 19 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరిన వరద నీటిని పొదుపుగా వాడుతూ సాగుకు, తాగుకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రాజెక్టుల్లోని నీరును వాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టుపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చి చేరిన వరద నీటిని ఇష్టానుసారంగా వాడడంతో, ఇప్పుడు సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు తాగు నీటి కషద్టలను ఎదుర్కోవాల్సి వస్తోంది. నాగార్జున సాగర్ జలాశయంలో నీరు రోజు రోజుకు అడుగంటుతూ డేడ్ స్టోరేజీకి 510 అడుగుల చేరువలో ఉంది.
గతేడాది జూలై నెలలోనే రిజర్వాయర్లోకి వరద నీరు పుష్కలంగా రావడంతో క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల చేసి, 4 నెలల పాటు 1190 టీఎంసీల నీటిని సముద్రంలోకి వృధాగా విడుదల చేశారు. రిజర్వాయర్లో పుష్కలంగా వచ్చి చేరిన వరద నీటిని పొదుపుగా వాడుకోవడంతో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఈ ఏడాది సాగర్ డ్యాం నీటి నిల్వలు డేడ్ స్టోరేజీకి చేరువ కావడంతో పంటలకు, తాగుకు నీరు అందే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 513.50 (137.6900 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉండగా డేడ్ స్టోరేజీకి 510 అడుగులకు కేవలం అడుగన్నర (6.021 టీఎంసీలు) మాత్రమే ఉంది. రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చి చేరేందుకు ఇంకా నెలకు పైగా సమయం పడుతుందని ఎన్ఎస్పీ అధికారులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిని పొదుపుగా వాడింది..
బీఆర్ఎస్ పాలన అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉండి కృష్ణా నదిలోని నీటిని పొదుపుగా వాడకుంటూ రావడంతో ఎప్పుడూ నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోలేదు, ప్రతి యేటా రెండు పంటలకు పుష్కలంగా నీరందించడంతో పాటు తాగు నీటి కష్టాలు ఏర్పడలేదు.
తాగు, సాగుకు నీటి విడుదల కష్టం..
కృషద్ణ నది డేడ్ స్టోరేజీకి 510 (131.6690) అడుగులు, 510 కంటే నీటి మట్టం దిగువకు పోతే ఎడమ కాల్వకు తాగు, సాగుకు నీరు విడుదల చేసేందుకు వీలు ఉండదు. ప్రస్తుతం ఎడమ కాల్వకు నీటి విడుదలకు రానున్న వర్షకాలం వరద నీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. హైదరాబాద్కు తాగునీటి కష్టాలు తప్పేటట్టు లేవు. డేడ్ స్టోరేజీకి చేరితే నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్కు మంచి నీటిని పంపింగ్ చేసే పుట్టంగండి పంపులకు నీరు అందదు. తాత్కాలిక మోటర్లను నది లోపలకి ఏర్పాటు చేసి పంపులతో నీటిని తోడి పంపాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఏర్పడలేదు.
