న్యూఢిల్లీ, నవంబర్ 5: ముడుపుల సొమ్మును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన లాభాలను మనీ లాండరింగ్ చట్టం కింద చేసిన నేరంతో సంపాదించిన డబ్బుగానే పరిగణించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
పెరిగిన ఆదాయం అవినీతి మరకను చెరిపివేయలేదని, వేరే రూపంలో ఆదాయాన్ని గడిచినంత మాత్రాన అసలు పెట్టుబడి అవినీతి ద్వారా గడించిందన్న వాస్తవం చెరిగిపోదని కోర్టు అభిప్రాయపడింది.