న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఆలంఘిర్ ఆలం, అతని మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్, సంజీవ్ ఇంట్లో పనిచేసే సహాయకుడు జహంగీర్ ఆలంకు చెందిన రూ.4.42 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఈ మేరకు దర్యాప్తు సంస్థ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిందితులపై రాంచీలోని ప్రత్యేక కోర్టులో గురువారం చార్జిషీట్ దాఖలు చేసినట్టు వెల్లడించింది. ఆలంఘిర్ గతంలో మంత్రిగా పనిచేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.