న్యూఢిల్లీ: ప్రభుత్వ స్కూల్ గోడపై ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ అనుకూల రాతలు కనిపించాయి. (Pro-Khalistan graffiti) ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వాటిని చెరిపివేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉత్తమ్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల గోడలపై ఖలిస్థాన్ అనుకూల రాతలు కపిపించాయి. స్కూల్ సరిహద్దు గోడపై వేర్పాటువాద ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే నినాదాలున్నాయి. ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్, అతడికి చెందిన నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వంటి సందేశాలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఖలిస్థాన్ అనుకూల రాతలను చెరిపివేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.
కాగా, ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి హెచ్చరిక జారీ చేశాడు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్‌ను రిపబ్లిక్ డే రోజున చంపుతామని మంగళవారం బెదిరించాడు. జనవరి 26న గూండాలంతా ఏకమై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రిపై దాడి చేయాలని పన్నూన్ పిలుపునిచ్చాడు.