వయనాడ్: కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆమె పయ్యంపల్లి, మనంతవాడిలో పురపాలక సంఘ భవనానికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఇది జరిగింది.
ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ఓ నామ ఫలకం (నేమ్ ప్లేట్)ను ఆమె ఆవిష్కరించాల్సి ఉంది. కానీ ఆవిష్కరించడానికి ముందే అది హఠాత్తుగా కింద పడిపోయి పగిలిపోయింది. దీంతో ఆమె అవాక్కయ్యారు. ఈ ఘటన పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వీడి యో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.