Lokasbha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. యూపీలోని రాయ్‌బరేలిలో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ మోదీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. దేశ సంపదను మోదీ కేవలం నలుగురైదుగురు వ్యక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ అనూహ్యంగా చేపట్టిన నోట్ల రద్దుతో కోట్లాది చిరు వ్యాపారులు, మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ హయాంలో ఈ పదేండ్లలో పేదల స్ధితిగతులు ఏమాత్రం మెరుగుపడలేదని, కానీ కాషాయ పాలకులు చేసిన అరకొర పనులను వార్తా ఛానెల్స్‌లో అదేపనిగా చూపుతున్నారని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. పేదలు, రైతుల కడుపుకొట్టి పారిశ్రామిక దిగ్గజాలకు మోదీ దోచిపెడుతున్నారని విమర్శించారు.
Read More :
Traffic Jam | సొంతూర్లకు ఓటర్లు.. ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్