Loksabha Elections 2024 : చత్తీస్ఘఢ్, రాజస్ధాన్ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేశామని కానీ కాషాయ పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో ప్రియాంక ఎన్నికల సభల్లో మాట్లాడారు.
తాము రైతుల రుణాలు మాఫీ చేస్తే కాషాయ పాలకులు సంపన్నుల రుణాలు మాఫీ చేశారని చెప్పారు. ఆవుల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతుంటారని, కానీ గోశాలల్లో గోవుల పరిస్ధితి దయనీయంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఒడిషాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర స్ధాయిలో ఉన్నాయని బీజేపీ, బీజేడీ లక్ష్యంగా అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
ఒడిషాలో 24 ఏండ్లుగా నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారని, ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. భువనేశ్వర్లో ఖర్గే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను మార్చాలని పిలుపు ఇచ్చారు. ఒడిషా వెనుకబాటుతనానికి బీజేపీ, బీజేడీలు బాధ్యత వహించాలని అన్నారు.
Read More :
Vishwambhara Movie | చిరంజీవి ‘విశ్వంభర’లో మరో సీనియర్ బ్యూటీ.?