లక్నో : వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వరాలు గుప్పించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, కొవిడ్-19 బాధితులకు రూ 25,000 పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. బారాబంకి నుంచి బుందేల్ఖండ్ వరకూ సాగే మూడు ప్రతిజ్ణా యాత్రలను శనివారం ప్రియాంక జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ యూపీ ప్రజలపై వరాల వాన కురిపించారు. కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తామని ఇప్పటికే ప్రియాంక ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంటర్ విద్యార్ధినులకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చేసే మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని ఇటీవల ప్రియాంక గాంధీ పలు హామీలు గుప్పించారు.