వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ వేశారు. తొలిసారిగా క్రియాశీల రాజకీయాల్లో నేరుగా పోటీ చేస్తున్న ఆమె నామినేషన్‌కు ముందు కాల్పెట్టా, తాంకెడ్లలో భారీ రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమంలో ఆమె వెంట తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. కాగా, తనకు 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రియాంక తెలిపారు.