Priyanka Gandhi | న్యాయం కోరితే బాధిత కుటుంబాలను బలి తీసుకుంటున్నారు : యోగి సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్
Priyanka Gandhi : కాన్పూర్లో సామూహిక లైంగిక దాడికి గురైన ఇద్దరు బాలికలు బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.
Priyanka Gandhi : కాన్పూర్లో సామూహిక లైంగిక దాడికి గురైన ఇద్దరు బాలికలు బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. కాన్పూర్ ఘటనను ప్రస్తావిస్తూ ఈ ఉదంతంలో మైనర్ బాలికల తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని, బాధిత కుటుంబాన్ని రాజీ పడాలని కుటుంబ సభ్యులను ఒత్తిడికి గురిచేస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రియాంక గాంధీ ఆరోపించారు.
ఈ ఘటనను హధ్రాస్, ఉన్నావ్ ఉదంతాలతో ప్రియాంక పోల్చారు. యూపీలో బాధిత బాలికలు, మహిళలు న్యాయం కావాలని అడిగితే వారి కుటుంబాలను ధ్వంసం చేయడం పరిపాటిగా మారిందని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నావ్, హథ్రాస్, కాన్పూర్ ఇలా మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారని, ఈ ఆటవిక రాజ్యంలో మహిళగా ఉండటం నేరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాగైతే రాష్ట్రంలోని కోట్లాది మహిళల పరిస్ధితి ఏంటి..వారు ఎక్కడికి వెళ్లాలని ఆమె ప్రశ్నించారు. కాన్పూర్ లైంగిక దాడి ఘటనపై యూపీలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం లక్ష్యంగా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ సైతం విమర్శలు గుప్పించారు.
Read More :
Covid Cases: ఢిల్లీ, రాజస్థాన్, యూపీల్లో పెరిగిన కోవిడ్ కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

