లక్నో : కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వైరల్ ఫీవర్ బాధపడుతున్నారు. దీంతో సోమవారం మొరాదాబాద్ పర్యటన ఆకస్మికంగా వాయిదా పడిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మొరాదాబాద్ రాంలీలా మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ ఆఫీసర్ల సదస్సులో ప్రసంగించాల్సి ఉన్నది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల నుంచి ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు.
ప్రియాంక గైర్హాజరుతో కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్‌కుమార్ లల్లూ ఆమె సందేశాన్ని వినిపించారు. విపరీతమైన వైరల్ ఫీవర్ కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోయారన్నారు. నిన్న తేలికపాటి జ్వరం ఉన్నప్పటికీ ఆమె బులంద్‌షహర్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ప్రియాంక రాకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. జ్వరం నుంచి కోలుకున్న అనంతరం మొరాదాబాద్ షెడ్యూల్ ప్రకటించనున్నారు.