Priyanka Gandhi | ప్రజా జీవితంలో ఉండే వారు కుటుంబానికి, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉండదు. నిత్యం ప్రజా సమస్యలు, పరిష్కారాలు, సమావేశాలు, కార్యకర్తలతో బిజీబిజీగానే రోజంతా అయిపోతుంది. వీరిపై పిల్లలు, కుటుంబీకులు కూడా నిత్యం అసంతృప్తితోనే వుంటుంటారు. అయితే.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాత్రం ఇప్పటికీ తమ పిల్లలకు హోం వర్క్ చేయిస్తారట. వారి పిల్లలు హోం వర్క్ చేస్తుంటే, వారికి సహాయపడతారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు.
ఫేస్బుక్ లైవ్‌లో ప్రియాంక చిట్‌చాట్ చేశారు. హోం వర్క్ చేసే సమయంలో మీ పిల్లలు మీ సహాయాన్ని కోరుతారా? అంటూ ఓ నెటిజన్ ప్రియాంకను అడిగారు. దీనికి ప్రియాంక గాంధీ బదులిస్తూ.. అవును.. ఇప్పటికీ నా పిల్లల హోంవర్క్‌లో సహాయం చేస్తుంటా. కొన్ని కొన్ని సార్లు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటా. ఉదయం 3,4 గంటల వరకు కూడా వారి హోం వర్క్‌లో సహాయం చేస్తుంటా. నా పిల్లలకే కాదు.. ఆంటీ అంటూ వచ్చే ఇతర పిల్లలకు కూడా హోంవర్క్‌లో సాయం చేస్తుంటా అని ప్రియాంక గాంధీ వెల్లడించారు. ప్రియాంకు మిరయా వాద్రా (18), రిహాన్ వాద్రా (20) అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు.