యూపీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వీలు చిక్కినప్పుడల్లా బీజేపీ సర్కారుపై ఒంటి కాలుతో లేస్తున్నారు. యోగి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్నారు. అయితే కాంగ్రెస్ నినాదం ఏమిటి? ఏ వర్గం ఓట్లపై ఎక్కువగా దృష్టి నిలిపింది? ఏ వర్గాన్ని ఆకర్షించాలని చూస్తోంది? దీనికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీయే స్వయంగా సమాధానమిచ్చారు. రోజు రోజుకీ రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని కోల్పోతుందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మీరేమంటారు? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ప్రియాంక ‘దీవార్’ సినిమా డైలాగ్‌ను ఉటంకించారు. ”దివార్ సినిమాలోని ఈ డైలాగును ఎప్పుడైనా విన్నారా? మేరేపాస్ మా హై.. (మా అమ్మ నాతోపాటే ఉంది) అని దీనర్థం. మేము కూడా ‘మేరే పాస్ బెహన్ హై’ (మా అక్క చెల్లెల్లు నాతోనే ఉన్నారు) అన్న నినాదంతోనే ముందకు సాగుతాం.” అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.. అమితాబచ్చన్, శశి కపూర్ కలిసి నటించిన సినిమా దివార్. ఇది 1975 లో వచ్చింది. మేరేపాస్ మా హై.. అన్నది ఈ సినిమాలో హైలెట్ డైలాగ్ . మరోవైపు ఈ మధ్య జరిగిన ప్రతి ర్యాలీలో కూడా ప్రియాంక గాంధీ మహిళలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు. మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను కూడా ప్రవేశడతామని ప్రకటించారు.