Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ పేలుడు (blast) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా ఓ పాఠశాలకు (Delhi School) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు (Private school) శుక్రవారం ఈ బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు 10:57 సమయంలో ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో పాఠశాల ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఢిల్లీలో బాంబు పేలుడు
ఢిల్లీ ప్రశాంత్ విహార్‌లోని పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు సమీపంలో గురువారం ఉదయం స్వల్ప తీవ్రత గల బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగిన పేలుడులో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి తెల్లటి పౌడర్ లభ్యమైందని, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు చేపట్టామని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ప్రశాంత్ విహార్‌లోని ఇదే ప్రాంతంలో అక్టోబర్ 20న సీఆర్పీఎఫ్ స్కూల్ గోడను ఆనుకొని భారీ పేలుడు ఒకటి సంభవించింది. ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ఢిల్లీ సీఎం ఆతిశీ ఆరోపించారు.
Also Read..
Indian Navy | అరేబియా సముద్ర జలాల్లో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం
Eknath Shinde | ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు.. రెండు రోజుల్లో సీఎంపై నిర్ణయం : ఏక్నాథ్ షిండే
Parliament Winter Session | ఆగని రభస.. రాజ్యసభ సోమవారానికి వాయిదా