విజయపుర : రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన తేలికపాటి ప్రైవేట్ విమానం సాంకేతిక సమస్య కారణంగా ఆదివారం కర్ణాటకలో కూలిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్, శిక్షణ పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే దగ్గర్లోని దవాఖానకు తరలించారు. విజయపుర జిల్లాలోని మంగళూరు గ్రామంలోని ఓ పొలంలోని నేలను విమానం ఢీ కొట్టింది.
దీంతో దాని ముందు భాగం బాగా దెబ్బ తింది. విమానం కలబురగి నుంచి బెళగావి వెళుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి హఠాత్తుగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.