Helicopter Crashes | మహారాష్ట్రలో పుణే జిల్లా పౌరీ ప్రాంతంలో శనివారం హెలికాప్టర్ కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలింది. ఇందుకు కారణాలు తెలియరాలేదు. ప్రతికూల వాతావరణం, సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నది. ఈ హెలికాప్టర్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ ధ్రువీకరించారు. గాయపడిన కెప్టెన్ ఆనంద్‌ను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. భాటియా, అమర్దీప్ సింగ్, ఎస్పీ రామ్‌ల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.
महाराष्ट्र के पुणे में एक हेलीकॉप्टर क्रैश होने का मामला सामने आया है। बताया जा रहा है कि तकनीकी खराबी की वजह से ये हेलीकॉप्टर क्रैश हुआ। इस हेलीकॉप्टर में पायलट के साथ तीन अन्य लोग सवार थे,जिसमें से दो लोग गंभीर रूप से घायल हैं। घायलों को इलाज के लिए अस्पताल ले जाया जा रहा है।… pic.twitter.com/plUPqbnsHt
— India TV (@indiatvnews) August 24, 2024