RTI | న్యూఢిల్లీ: ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత ప్రైవేట్ దవాఖానల లైసెన్సులను రెన్యువల్ చేసే పద్ధతులను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సూచించింది. అత్యవసర ప్రజా సేవలను అందజేసే ప్రైవేట్ దవాఖానలను కూడా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావలసి ఉందని సమాచార హక్కు కమిషనర్(సీఐసీ) వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
2023లో తన భార్యకు చికిత్స అందజేసిన ఓ ప్రైవేట్ దవాఖాన విపరీతంగా బిల్లులు వేసిందని, ఆర్టీఐ కింద దాని లైసెన్స్ వివరాలు తనకు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ ఆర్టీఐ దరఖాస్తుదారుడు వేసిన కేసు విచారణ సందర్భంగా సీఐసీ ఈ వ్యాఖ్యలు చేశారు.