ముంబై : ప్రజల జీవితాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోదీ గురువారం చెప్పారు. సంగీతం, నృత్యం, కథలు చెప్పడం వంటి కళా రూపాల ద్వారా మరింత కరుణరస పూరితమైన భవిష్యత్తును నిర్మించాలని కంటెంట్ క్రియేటర్లను కోరారు. మానవులు రోబోలుగా మారకూడదని చెప్పారు. వరల్డ్ ఆడి యో విజువల్ అండ్ ఎంటర్టైన్మెం ట్ సమ్మిట్(వేవ్స్) ప్రారంభం సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు.