Pamban Rail Bridge : రామేశ్వరాన్ని తమిళనాడుతో కలుపుతూ నిర్మించిన పంబన్ రైల్ బ్రిడ్జిని రేపు (ఆదివారం) ప్రారంభించనున్నారు. షిప్‌లు వచ్చినప్పుడు బ్రిడ్జిని పైకి లేపి దారిచ్చేలా అద్భుతమైన ఇంజినీరింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. దేశంలో ఇలాంటి బ్రిడ్జిని నిర్మించడం ఇదే తొలిసారి. రేపు శ్రీరామనవమి సందర్భంగా భారత ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక అయిన ఈ వారధి ప్రారంభం కాబోతోంది.
ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రేపు తమిళనాడులో పర్యటించనున్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున ఈ పంబన్ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జ్ మధ్యలో షిప్‌లు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్‌తో ఇంజినీర్లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. తుప్పు పట్టకుండా బ్రిడ్జి మొత్తం స్పెషల్ కెమికల్‌తో కోటింగ్ చేశారు. ఆదివారం శ్రీ రామనవమి సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడును సందర్శించి, రామేశ్వరం నుంచి మెయిన్‌ల్యాండ్‌కు అనుసంధానించే నూతన పంబన్ రైలు వంతెనను ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని తమిళనాడులో రూ.8,300 కోట్లకుపైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు. రామేశ్వరం-తాంబరం (చెన్నై) మధ్య నూతన రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించనున్నారు.