కోల్కతా: దేశంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి రైల్వే వ్యవస్థలో సముల మార్పులు తెస్తున్నామని, ఎయిర్పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హౌరా నుంచి న్యూ జల్పాయిగురి మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్తో పాటు పశ్చిమ బెంగాల్లో పలు రైల్వే ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిన ప్రారంభించారు.
సీఎం మమత అలక
ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలక వహించారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైశ్రీరాం నినాదాలు చేయడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. వేదికపైకి వెళ్లేందుకు నిరాకరించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ ఆనంద్బోస్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. వేదిక కిందే కూర్చుండిపోయారు.