PM Modi: దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషనల్ క్రియేటర్స్ పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అయితే ఇలా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేయడం దేశంలోనే తొలిసారి.
ఈ అవార్డుల కార్యక్రమంలో మైథిలీ ఠాకూర్‌కు ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను ప్రధాని అందజేశారు. అదేవిధంగా జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్‌కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డు అందజేశారు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం, కథలు చెప్పడం, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్ తదితర ఆవిష్కరణలకు ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు.
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Cultural Ambassador of The Year award to Maithili Thakur at Bharat Mandapam. pic.twitter.com/uD0g9vkaxq
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Best Creator for Social Change award to Jaya Kishori at Bharat Mandapam. pic.twitter.com/cJzxGhZbTQ
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Favourite Green Champion award to Pankti Pandey at Bharat Mandapam. pic.twitter.com/egMaLyR4wd
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Favourite Travel Creator award to Kamiya Jani at Bharat Mandapam. pic.twitter.com/zWr0ASWe2w
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Best Creator in Tech Category award to Gaurav Chaudhary at Bharat Mandapam. pic.twitter.com/wIJRzlrmAy
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first-ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Swachhta Ambassador Award to Malhar Kalambe at Bharat Mandapam. pic.twitter.com/aviScJyEWY
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first-ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Heritage Fashion Icon Award to Jahnvi Singh at Bharat Mandapam. pic.twitter.com/cjzTGm7vbJ
— ANI (@ANI) March 8, 2024
ప్రస్తుతం 20 విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. అయితే భారతీయులకు మాత్రమే ఈ అవకాశమని చెప్పారు. వారు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రచురించిన కంటెంట్ ఉండాలన్నారు. కంటెంట్ సృష్టికర్తలు గరిష్టంగా మూడు కేటగిరీల్లో నామినేషన్ వేసుకునే అవకాశం కల్పించారు.
కాగా, ది బెస్ట్ స్టోరీ టెల్లర్ అవార్డు నుంచి ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ అవార్డు వరకు పలు విభాగాల్లో 200 మంది క్రియేటర్లు ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు. నామినీల్లో కత్రినా కైఫ్, కంగనా రనౌత్, రణవీర్ వంటి నటీనటులు ది ఫేవరెట్ సెలబ్రిటీ క్రియేటర్ కేటగిరీలో ఉండగా.. సోషల్ మీడియా విభాగంలో కోమల్ పాండే, సిద్ధార్థ్ బాత్రా, కృతిక ఖురానా తదితరులు ఉన్నారు.
తొలి రౌండ్లో 20 విభిన్న కేటగిరీల్లో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు రాగా.. ఓటింగ్ రౌండ్లో వివిధ విభాగాల్లో డిజిటల్ సృష్టికర్తలకు దాదాపు 10 లక్షల ఓట్లు పోలయ్యాయి. తర్వాత ముగ్గురు అంతర్జాతీయస్థాయి క్రియేటర్స్‌తో సహా 23 మందిని విజేతలుగా నిర్ణయించారు.