Chenab Bridge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి (worlds highest railway bridge) చీనాబ్ రైలు వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాని ప్రారంభించారు. జెండా ఊపి రైల్వే వంతెనపై రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీసిన కోచ్‌లో ప్రధాని ప్రయాణించారు.
#WATCH | J&K: Prime Minister Narendra Modi inaugurates Chenab bridge – the world’s highest railway arch bridge. Lt Governor Manoj Sinha, CM Omar Abdullah and Railway Minister Ashwini Vaishnaw also present.#KashmirOnTrack
(Video: DD) pic.twitter.com/Jv4d5tLOqW
— ANI (@ANI) June 6, 2025
చీనాబ్ రైలు వంతెనను భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ వంతెన జమ్ము కశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జ్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం ఇచ్చారు. ఇక తన పర్యటనలో భాగంగా సుమారు రూ.46,000 కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
చీనాబ్ విశేషాలు..
ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది.
Also Read..
Golden Temple | ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 41 ఏళ్లు.. స్వర్ణ దేవాలయంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు
Reserve Bank of India: రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
Fixed Deposits: ఎఫ్‌డీల నుంచి 4 కోట్లు కాజేసిన బ్యాంకు మేనేజర్.. ఆ స్టోరీ తెలుసుకోవాల్సిందే