PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి భోజనం చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలకు ఆహ్వానం లభించింది. బీజేపీ ఎంపీలు హీనా గవిట్, కోన్యక్, జమ్యంగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర పార్లమెంట్ క్యాంటిన్లో ప్రధాని మోదీతో కలిసి లంచ్ చేశారు.
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రధానితో లంచ్‌కు సంబంధించి ఎంపీలకు సమాచారం అందించినట్టు తెలిసింది. పదండి మీకో పనిష్మెంట్ ఇవ్వాలని ప్రధాని ఈ సందర్భంగా ఎంపీలతో అన్నట్టు సమాచారం. ఇక ప్రధానితో విందు ఆరగించిన ఎంపీలు శాకాహార భోజనంతో పాటు క్యాంటిన్లో రాగి లడ్డూలను ఆస్వాదించారు.
Read More :