భువనేశ్వర్: యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ మధ్యాహ్నం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకున్న ప్రధాని.. ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో తుఫాన్ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి హెలిక్యాప్టర్‌లో ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
అనంతరం ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్లో తుఫాన్ పరిస్థితిపై అక్కడి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి కూడా హాజరు కావాల్సి ఉండగా.. కేంద్రం బెంగాల్ బీజేపీ నేతలను కూడా సమావేశానికి ఆహ్వనించడాన్ని నిరసిస్తూ ఆమె హాజరుకాబోనని తెగేసి చెప్పారు.
#WATCH Prime Minister Narendra Modi conducts an aerial survey of cyclone Yaas affected areas in West Bengal and Odisha
— ANI (@ANI) May 28, 2021
Union Minister Dharmendra Pradhan is accompanying him pic.twitter.com/Njl0XUly0n