కన్యాకుమారి, జూన్ 1: ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో తన 45 గంటల ధ్యానాన్ని శనివారం ముగించారు. మోదీ కన్యాకుమారిలో చేసింది ఫొటో షూట్ స్టంట్ అని.. అది ఆధ్యాత్మిక సందర్శన ఎంత మాత్రం కాదని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్శించారు. ‘మోదీజీ ఎలాంటి ధ్యానం చేయడం లేదు. కేవలం ఫొటో షూట్స్ మాత్రమే జరుగుతున్నాయి. అవి అయిపోగానే ఆయన వెనక్కు వస్తారు’ అని యాదవ్ అన్నారు. ఎన్నికల చివరి దశ ప్రచారం ముగింపు రోజైన గురువారం మోదీ ధ్యానం కోసం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.