లక్నో: ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi ) ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. వారణాసి ఎయిర్‌పోర్టులో ఆయనకు సాధార స్వాగతం పలికారు. కాగా, ప్రధాని మోదీ కాసేపట్లో కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకుని అక్కడ నిర్మిస్తున్న శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.339 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను ప్రారంభించనున్నారు.