ముంబై: ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో రిటైర్ అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అందుకే ఆయన నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కా ర్యాలయాన్ని సందర్శించారని శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజ య్ రౌత్ వెల్లడించారు. గత 10-11 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆర్ఎస్ఎస్ ప్రధాన కా ర్యాలయంలో అడుగుపెట్టని ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు వీడ్కోలు చెప్పేందుకే అ క్కడకు వెళ్లారని సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రౌత్ వ్యాఖ్యానించారు.