అమరావతి : కాశీబుగ్గ తొక్కిసలాట ( Kasibugga Stampede) ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ప్రముఖ ఆలయంమైన కాశీబుగ్గ (Kasibugga) వేంకటేశ్వర స్వామి ఆలయం ( Vekateswara Swamy temple ) లో ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మహిళలు, ఒక బాలుడున్నారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన పలాసఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తుల తాకిడికి రెయిలింగ్ ఊడిపోయి పలువురు కిందపడటంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.