న్యూఢిల్లీ: మూడు దేశా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ చేరుకున్నారు. ఆ దేశంతో భారత్‌కు దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన జరుగుతున్నది. ఆ దేశ ప్రధాని జాఫర్ హస్సేన్‌తో మోదీ సమావేశమవుతారు. ఇరు దేశాల ప్రతినిధుల సమావేంలోనూ భారత ప్రధాని పాల్గొంటారు. మంగళవారం జోర్డాన్ రాజు, యువరాజు, స్థానిక ప్రవాస భారతీయులతో మోదీ వేర్వేరుగా సమావేశం అవుతారు. అనంతరం తన పదవీ కాలంలో మొదటిసారిగా ఇథియోపియాలో పర్యటించి ఆ దేశ ప్రధానితో చర్చలు జరుపుతారు. ఆ దేశ పార్లమెంట్లో మోదీ ప్రసంగించనున్నారు. చివరగా ఒమన్‌లో పర్యటించినప్పుడు ఆ దేశ సుల్తాన్, ప్రధానితో భారత ప్రధాని చర్చలు జరుపుతారు.