న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో ఆయన ఓ మొక్కను నాటారు.
‘అమ్మ పేరు మీద ఓ చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు దాదాపు 700 కి.మీ. మేరకు గల ఆరావళి పర్వత శ్రేణుల్లో అడవుల పునరుద్ధరణ కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.