న్యూఢిల్లీ: దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ (G-20 Summit)కు అమెరికా మీడియాను మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కు తొలిసారి వచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా జర్నలిస్టులు కూడా బైడెన్‌తో కలిసి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు.
కాగా, జీ20 సమ్మిట్ కవరేజ్ కోసం వచ్చిన అమెరికా జర్నలిస్టులు జో బైడెన్, మోదీని ప్రశ్నించాలని భావించారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే మోదీ ప్రభుత్వం ఇందుకు నిరాకరించినట్లు ఆరోపించింది. ప్రోటోకాల్ నిబంధనలు, సెక్యూరిటీ ఆంక్షల కారణాలతో తమను అనుమతించకపోవడంపై అమెరికా జర్నలిస్టులు అంసతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో ఏడాదికి ఏడాది భారత్ ర్యాంకు పడిపోతున్నదని కాంగ్రెస్ విమర్శించింది. మొత్తం 180 దేశాలకుగాను ఈ ఏడాది భారత్ 161వ స్థానంలో ఉన్న వ్యంగ్య కార్టూన్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
अमेरिका से राष्ट्रपति जो बाइडन के साथ पत्रकार आए हैं। ये पत्रकार PM मोदी और जो बाइडन से सवाल करना चाहते थे।
अमेरिका की सरकार सवालों के लिए तैयार थी, लेकिन मोदी सरकार ने पत्रकारों को सवाल पूछने की इजाजत नहीं दी।
वर्ल्ड प्रेस फ्रीडम इंडेक्स में भारत 161 नंबर पर है, 180 देशों की… pic.twitter.com/oWxKphBIc4
— Congress (@INCIndia) September 9, 2023