బెంగాల్లో రాష్ట్రపతి పాలన?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ, సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ఆ రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళుతున్నది.
- ఒకటి రెండు రోజులు ఉండే అవకాశం
- మమత రాజీనామా నిరాకరణతో రాజ్యాంగ సంక్షోభం
కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ, సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ఆ రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళుతున్నది. బీజేపీ కొత్త ప్రభుత్వం శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ అరుదైన పరిస్థితిపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ స్పందిస్తూ.. సీఎం రాజీనామా చేయకుంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనదని పేర్కొంటూ గవర్నర్ ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) ప్రయోగించవచ్చని తెలిపారు.
ఒకటి రెండు రోజుల కోసమైనా సరే, ఇలాంటి స్థితిలో రాష్ట్రపతి పాలనే ఏకైక మార్గం. ఒకే సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలో ఉండలేరని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. మమత ఇలా అడ్డుపడడం వల్ల రాజ్యాంగపరమైన గందరగోళం తప్ప మరేమీ సాధించలేరని పేర్కొన్నారు. అసెంబ్లీలో విశ్వాసం కోల్పోయిన సీఎం పదవిలో కొనసాగడానికి వీల్లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. చివరికి, మెజారిటీ ఉన్న పార్టీకి అధికారాన్ని అప్పగించే బాధ్యత ఇప్పుడు గవర్నర్పై ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

