జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్.. 21న ఫలితాలు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను జూన్ 15న విడుదల చేస్తామని తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29 అని చెప్పారు. 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణ గడువుకు చివరి తేదీ జులై 2.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల జులై 24తో ముగియనుంది. 2017, జులై 25న రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి రామ్నాథ్ కోవిందే.
Voting for Presidential elections to be held on 18th July, counting of votes on 21st July: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/bTvawdiE9I
— ANI (@ANI) June 9, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

