తిరువనంతపురం: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు చెందిన విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆవిష్కరించారు. కేరళ రాజ్‌భవన్‌లో నారాయణన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దళిత కమ్యూనిటీకి చెందిన నారాయణన్.. 1997 నుంచి 2002 వరకు రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించారు. ఆయన సేవలు స్మరించేందుకు ఛాతి భాగం వరకు ఉన్న నారాయణన్ ప్రతిమను ఏర్పాటు చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, సీఎం విజయన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ తర్వాత ముర్ము మాట్లాడారు. కేఆర్ నారాయణన్ జీవితం ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో నిండి ఉందన్నారు.
President Droupadi Murmu unveiled the bust of former President of India, late Shri K R Narayanan and paid floral tributes at Kerala Raj Bhavan. She said that Shri Narayanan has left behind a rich legacy of morality, integrity, compassion, and democratic spirit. The President… pic.twitter.com/DlizWSK4bK
— President of India (@rashtrapatibhvn) October 23, 2025