ప్రత్యేక రైలులో సొంతూరికి రాష్ట్రపతి కోవింద్
ప్రత్యేక రైలులో సొంతూరికి రాష్ట్రపతి కోవింద్ | రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ కన్పూర్‌లోని తన స్వస్థలం పారౌఖ్‌కు వెళ్లనున్నారు. రైలు మార్గం ద్వారా సొంతూరుకి చేరుకోనున్నారు.

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ కన్పూర్‌లోని తన స్వస్థలం పారౌఖ్‌కు వెళ్లనున్నారు. రైలు మార్గం ద్వారా సొంతూరుకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన పరిచయస్తులతో పాటు కలిసి చదువుకున్న పాఠశాల మిత్రులను కలువనున్నారు. అయితే, 15 సంవత్సరాల తర్వాత భారత రాష్ట్రపతి రైలులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందే రాంనాథ్ కోవింద్ సొంత గ్రామానికి వెళ్లాలనుకున్నా.. కరోనా మహమ్మారి కారణంగా సాధ్యం కాలేదని రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
ప్రత్యేక రైలు శుక్రవారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి.. సాయంత్రం కాన్పూర్ చేరుకుంటుంది. కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురాల వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. ఇక్కడ నాటి పాత పరిచయస్తులను కలువనున్నారు. గ్రామాన్ని సందర్శించిన తర్వాత తిరిగి ఈ నెల 28న కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో లక్నోకు చేరుకుంటారు. పర్యటన అనంతరం తిరిగి 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి రానున్నారు.
2006లో రైలు ప్రయాణించిన అబ్దుల్ కలాం
ఇంతకు ముందు 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. అక్కడ ఇండియన్ మిలటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. అలాగే దేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం తరచూ రైలు ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజేంద్రప్రసాద్ బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లాలోని తన జన్మస్థలమైన జిరాడీని సందర్శించారు. ఛప్రా నుంచి ప్రత్యేక రైలులో ప్రయాణించారు.
ఇవి కూడా చదవండి..
‘కొవిడ్ థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్‌తో సంబంధం లేదు’
Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
నేటి నుంచి శ్రీశైలంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన
దేశంలో కొత్తగా 54వేల కరోనా కేసులు
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్‌రెడ్డి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

