అంబాలా : దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాఫెల్ ఫైటర్ జెట్‌లో గగన విహారం చేశారు. సహ పైలట్‌గా 30 నిమిషాల పాటు విహార యాత్ర పూర్తి చేసిన తర్వాత హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో స్కాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలిసి బుధవారం కన్పించారు.
ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించిన చిత్రాలు పాకిస్థాన్‌ను చెంపదెబ్బ కొట్టినట్టయ్యింది. ఎందుకంటే రాఫెల్ విమానాన్ని కూల్చి ఈ పైలట్‌నే తాము ఆపరేషన్ సిందూర్‌లో పట్టుకున్నామని పాకిస్థాన్ అప్పట్లో తప్పుడు ప్రచారం చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ సహా పలు ఫైటర్ జెట్లను కూల్చామని, ఆ దాడిలో శివాంగి విమానంలోంచి దూకిన తర్వాత ఆమెను సియోల్కోట్లో పట్టుకున్నట్టు పాకిస్థాన్ అప్పట్లో తప్పుడు ప్రచారం చేసింది.