కోల్‌కతా, ఆగస్టు 17: నౌకాదళం అమ్ములపొదిలోకి మరో అధునాతన యుద్ధనౌక చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ వింధ్యగిరి యుద్ధనౌకను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.కోల్‌కతాలోని హుగ్లీ నదీతీరంలో ఈ స్టెల్త్ యుద్ధనౌక జలప్రవేశం చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సెన్సార్లు దీని సొంతమని, క్షిపణి దాడులతో విరుచుకుపడుతుందని యుద్ధనౌక నిర్మాణంలో పాలుపంచుకున్న ‘గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్’ అధికారులు వెల్లడించారు.