Gallantry Awards | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలకు కేంద్రం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. సాయుధ దళాలకు ఇచ్చే 76 మంది గ్యాలంటరీ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. ఇందులో నాలుగు కీర్తిచక్ర (మరణానంతరం), 11 శౌర్య చక్ర అవార్డులు ప్రకటించింది. ఇందులో మరణానంతరం ఐదుగురికి కీర్తిచక్ర ఇవ్వనున్నది. 52 మందికి సేవా పతకాలను ముగ్గురికి నౌ సేనా పతకాలు, నలుగురు వాయుసేన పతకాలను ఇచ్చేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అలాగే విధుల్లో అసాధారణమైన సేవలు అందించిన భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి రాష్ట్రపతి తత్రరక్షక్ పతకం (PTM), ఐదు తత్రరక్షక్ పతకాల (TM)కు సైతం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
జైళ్లశాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సేవా పతకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతకాలను ప్రకటించగా.. రాష్ట్రం నుంచి నలుగురికి అవార్డులు వరించాయి. డీఎస్పీ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ్, అదనపు డిప్యూటీ జైలర్ సీహెచ్ కైలాశ్, హెడ్ వార్డర్ మల్లారెడ్డికి పతకాలకు ఎంపికయ్యారు.