న్యూఢిల్లీ: అసాధారణ విజయాలు సాధించిన 19 మంది బాలలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రదానం చేస్తారు. కళలు, సంస్కృతి విభాగంలో ఏడుగురికి, సాహస కృత్యాలు, నవ కల్పన, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఒక్కొక్కరికి, సామాజిక సేవ విభాగంలో నలుగురికి, క్రీడా విభాగంలో ఐదుగురికి ఈ పురస్కారాలను ఇస్తారు. 18 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 10 మంది బాలికలు, తొమ్మిది మంది బాలురు ఈ పురస్కారాలను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం విజ్ఞాన్ భవన్లో జరుగుతుంది.