Cirme news : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా హింసించి హత్య చేశాడు. మూడు నెలల గర్భిణి అయిన తన భార్య ప్రమాదంలో చనిపోయిందని వైద్యులను నమ్మించాడు. పోస్ట్‌మార్టం చేస్తుండగా మృతురాలి అవయవాల్లో ఇనుపరాడ్డు ఆనవాళ్లు కనిపించడంతో వైద్యులు విస్తుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. సకారియా గ్రామానికి చెందిన ప్రదీప్ అగారియా తన భార్య హీరాబాయి (23) పై తీవ్రంగా దాడి చేశాడు. గర్భిణి అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మోటారు సైకిల్‌పై ఆమె మృతదేహాన్ని కట్టుకొని అంబికాపూర్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో తన భార్య ప్రాణాలు కోల్పోయిందని వైద్యులను నమ్మించాడు.
పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సమయంలో మృతురాలి అవయవాల్లో ఇనుప రాడ్డు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.