న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న చోట గంగానదీ జలాలు కలుషితం అయ్యాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సోమవారం ఆరోపించారు. గత నెల మౌని అమావాస్య సందర్భంగా మహా కుం భ్లో సంభవించిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను గంగా నదిలోనే పడేయడంతో ఆ జలాలు కలుషితం అయ్యాయని సోమవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఆరోపించారు.
మహా కుంభమేళాకు వచ్చే సామాన్య ప్రజలకు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని ఆమె విమర్శించారు.