పాట్నా: బీహార్‌లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన
ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్’ పార్టీని ప్రారంభించారు. బుధవారం పాట్నాలో ప్రముఖుల సమక్షంలో తన రాజకీయ పార్టీని ఆవిష్కరించారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి ఈ పార్టీకి నేతృత్వం వహిస్తారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని అన్ని స్థానాల్లో జన్ సూరజ్ పార్టీ పోటీ చేయనున్నది.
కాగా, పార్టీ ప్రారంభం సందర్భంగా ‘జై బీహార్’ అని గట్టిగా నినాదించాలని భారీగా హాజరైన ప్రజలను ప్రశాంత్ కిషోర్ కోరారు. ‘మీరంతా ‘జై బీహార్’ అని గట్టిగా అన్నాలి. అప్పుడే మిమ్మల్ని, మీ పిల్లలను ఎవరూ ‘బీహారీ’ అని పిలవరు, అలా దూషించరు. మీ వాయిస్ ఢిల్లీకి చేరాలి. బీహార్ విద్యార్థులను కొట్టిన బెంగాల్‌కు అది చేరాలి. బీహార్ పిల్లలను హింసించిన, కొట్టిన తమిళనాడు, ఢిల్లీ, ముంబైలో లేదా ఎక్కడికైనా ఈ గొంతు వినిపించాలి’ అని అన్నారు.
మరోవైపు గత 25 ఏళ్లలో లాలూ ప్రసాద్ లేని కారణంగా బీహార్ ప్రజలు భయపడి బీజేపీకి ఓటు వేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ సోమవారం విమర్శించారు. బీహార్ ప్రజల రాజకీయ నిస్సహాయతను అంతం చేయడమే ‘జన్ సూరజ్’ పార్టీ లక్ష్యమని తెలిపారు. బీహార్ ప్రజలు ఒక మంచి ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవాలని అన్నారు.
కాగా, తమ పార్టీ ఎన్నికైతే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఆ ఆదాయాన్ని విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి వినియోగిస్తామని చెప్పారు. ‘జన్ సూరజ్’ పేరుతో పాద యాత్ర చేపట్టిన ఆయన బీహార్‌లోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
#WATCH | Patna, Bihar | Jan Suraaj founder Prashant Kishor to officially launch his political party, shortly.
He says, “…You all need to say ‘Jai Bihar’ so loud that no one calls you and your children ‘Bihari’ and it feels like an abuse. Your voice must reach Delhi. It must… pic.twitter.com/rgJpY4mS9w
— ANI (@ANI) October 2, 2024
#WATCH | Patna, Bihar | Jan Suraaj founder Prashant Kishor officially launched his political party – Jan Suraaj Party.
He says, “If Bihar has to have a world-class education system, Rs 5 lakh crore is needed in the next 10 years. When the liquor ban will be removed, that money… pic.twitter.com/w8Og4Cn2NX
— ANI (@ANI) October 2, 2024