Pralhad Joshi : పునరుత్పాదక ఇంధన సామర్ధ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వ్యవస్ధగా ఎదిగిందని, సోలార్ విద్యుత్ సామర్ధ్యంలో నాలుగో స్ధానంలో ఉందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తనపై విశ్వాసంతో తనకు ఈ మంత్రిత్వ శాఖ కట్టబెట్టారని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రధాని తమపై పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయకుండా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు.
అపార అనుభవం కలిగిన జట్టుతో తాము ముందుకెళుతున్నామని చెప్పారు. ప్రహ్లాద్ జోషీ మంగళవారం ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతామని అన్నారు.
Read More :