బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయాపై తన పోస్ట్‌ను వక్రీకరించారని, తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆరెస్సెస్ సభ్యులు, అడ్వకేట్ శంతను సిన్హా స్పష్టం చేశారు. అమిత్ మాల్వీయాపై తాను లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని అన్నారు.
సోషల్ మీడియాలో బెంగాలీలో తాను చేసిన పోస్ట్‌లో అమిత్ మాల్వీయాపై ఎలాంటి ఆరోనణలు చేయలేదని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనూ వ్యవహరించలేదని చెప్పారు. విజయ్ వర్గీయ, ప్రదీప్ జోషీ వంటివారు హనీ ట్రాప్‌లో చిక్కుకున్న క్రమంలో జాగ్రత్తగా వ్వవహరించాలని మాత్రమే తాను అమిత్ మాల్వీయాకు సూచించానని పేర్కొన్నారు. తాను పార్టీ కార్యకర్తనని, రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచానని చెబుతూ సొంత పార్టీని, నేతలను తాను ఎందుకు అవమానిస్తానని ప్రశ్నించారు.
తన వ్యాఖ్యలను దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ వక్రీకరించిందని ఆరోపించారు. బెంగాలీ పోస్ట్‌ను కొందరు అర్ధం చేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ పోస్ట్‌పై ఈరోజు వివరణ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అమిత్ మాల్వీయా తనపై ఫిర్యాదు చేసినా తాను ఎదుర్కొంటానని చెప్పారు.
కాగా బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వీయా బెంగాల్ బీజేపీ కార్యాలయాల్లోనే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శంతను సిన్హా ఆరోపించారని కాంగ్రెస్ నేత శ్రీనాథ్ శ్రీనటె సంచలన ఆరోపణలు చేశారు. శ్రీనటె ఆరోపణలు కాషాయ పార్టీలో కలకలం రేపాయి.
Read More :