న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: సీపీఎం పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ తాత్కాలిక సమన్వయకర్తగా పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ కారత్ వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24న మధురైలో జరిగే పార్టీ సమావేశం వరకు ఆయనే కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని కేంద్ర కమిటీ ఆదివారం తెలిపింది.
పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ఈ నెల 12న మృతి చెందడంతో ఈ తాత్కాలిక నియామకాన్ని చేపడుతున్నట్టు ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కమిటీ ప్రకటించింది. కాగా పార్టీలో సీనియర్ నేత అయిన ప్రకాశ్ కారత్ 2005 నుంచి 2015 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.