న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు కరోనా సోకింది. తనకు పాజిటివ్‌గా రిపోర్డు వచ్చినట్లు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారతా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
I have tested #COVID positive today. All those who have come in contact with me in the last 2-3 days may please get themselves tested.
— Prakash Javadekar (@PrakashJavdekar) April 16, 2021
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ వైపు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న కేసులతో దవాఖానల్లో బెడ్లు సరిపోవడం లేదు. మరో వైపు భారీగా పెరుగుతున్న మరణాలతో శ్మశానాల్లోనూ స్థలం దొరకడం లేదు. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన రేపుతున్నది.