న్యూఢిల్లీ: లైంగిక దాడి అభియోగాలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రేవణ్ణ చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని వ్యాఖ్యానిస్తూ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఆయనపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొన్నది.
ఆయనకు బెయిల్ తిరస్కరిస్తూ కర్ణాటక హైకోర్ట్ అక్టోబర్ 21న తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని చెప్పింది.