బెంగుళూరు: చంద్రయాన్-3కి చెందిన పెద్ద అప్డేట్ ఇచ్చారు ఇస్రో చీఫ్ సోమనాథ్. విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ సుమారు వంద మీటర్ల దూరం వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఆదిత్య ఎల్1 మిషన్ సక్సెస్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-3కి చెందిన అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నట్లు సోమనాథ్ చెప్పారు. ల్యాండర్, రోవర్లు ఇంకా ఫంక్షన్ చేస్తున్నాయన్నారు. రోవర్ పంపిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. మరో ఒకటి రెండు రోజుల్లో రోవర్, ల్యాండర్లను స్లీపింగ్ మోడ్‌లోకి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
Chandrayaan-3 Mission:
🏏Pragyan 100*
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
— ISRO (@isro) September 2, 2023